కంటెంట్‌కు వెళ్లు

ఒకరికన్నా ఎక్కువమందిని పెళ్లి చేసుకోవచ్చా?

ఒకరికన్నా ఎక్కువమందిని పెళ్లి చేసుకోవచ్చా?

బైబిలు ఇచ్చే జవాబు

 దేవుడు కొంతకాలం వరకు ఒకరికన్నా ఎక్కువమందిని పెళ్లి చేసుకోవడాన్ని అనుమతించాడు. (ఆదికాండము 4:19; 16:1-4; 29:18-29) కానీ ఆ పద్ధతిని దేవుడు ప్రారంభించలేదు. ఆయన ఆదాముకు ఒక్క భార్యనే ఇచ్చాడు.

 ఒక్కరినే పెళ్లిచేసుకోవాలనే ఆయన ప్రమాణాన్ని యేసుక్రీస్తు ద్వారా తిరిగి స్థాపించాడు. (యోహాను 8:28) కొంతమంది పెళ్లి గురించి అడిగితే: “సృజించిన వాడు ఆదినుండి వారిని పురుషునిగాను స్త్రీనిగాను సృజించెననియు—ఇందు నిమిత్తము పురుషుడు తలిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏకశరీరముగా ఉందురు” అని యేసు చెప్పాడు. —మత్తయి 19:4, 5.

 ఆ తర్వాత యేసు శిష్యుల్లో ఒకరు దేవుని ప్రేరణతో ఇలా రాశారు, “ప్రతివానికి సొంతభార్య యుండవలెను, ప్రతి స్త్రీకి సొంతభర్త యుండవలెను.” (1 కొరింథీయులు 7:2) క్రైస్తవ సంఘంలో, ఓ పెళ్లయిన సహోదరునికి ప్రత్యేక బాధ్యతలు ఇవ్వాలంటే, ఆయన “ఏకపత్నీ పురుషుడు” అయ్యుండాలని బైబిలు చెబుతుంది.—1 తిమోతి 3:2, 12.