కంటెంట్‌కు వెళ్లు

బైబిల్లో పర్గేటరీ లేదా పాపవిమోచనా లోకం గురించి ఉందా?

బైబిల్లో పర్గేటరీ లేదా పాపవిమోచనా లోకం గురించి ఉందా?

బైబిలు ఇచ్చే జవాబు

 లేదు. పర్గేటరీ లేదా పాపవిమోచనా లోకం అనే మాటే బైబిల్లో లేదు. అంతేకాదు చనిపోయినవాళ్ల ఆత్మలు పాపవిమోచనా లోకంలో శుద్ధి చేయబడతాయని కూడా బైబిలు చెప్పడం లేదు. a పాపమరణాల గురించి బైబిలు ఏమి బోధిస్తుందో, ఆ బోధలు పర్గేటరీ సిద్ధాంతానికి ఎలా విరుద్ధంగా ఉన్నాయో పరిశీలించండి.

  •   పర్గేటరీలో ఉండడంవల్ల కాదుగానీ యేసు రక్తం మీద విశ్వాసం ఉంచడం వల్ల ఒక వ్యక్తి పాపం నుండి శుద్ధి అవుతాడు. “[దేవుని] కుమారుడైన యేసు రక్తం మన పాపాలన్నిటినీ కడిగివేస్తుంది” అని, “యేసుక్రీస్తు . . . తన రక్తంతో మనల్ని మన పాపాల నుండి విడిపించాడు” అని బైబిలు చెప్తుంది. (1 యోహాను 1:7; ప్రకటన 1:5, న్యూ అమెరికన్‌ బైబిల్‌) యేసు “అనేకుల కోసం విమోచనగా తన ప్రాణాన్ని” ఇచ్చాడు.—మత్తయి 20:28, న్యూ అమెరికన్‌ బైబిల్‌.

  •   చనిపోయినవాళ్లు స్పృహలో ఉండరు. “బ్రతికివున్నవాళ్లకు తాము చనిపోతామని తెలుసు, కానీ చనిపోయినవాళ్లకు ఏమీ తెలీదు.” (ప్రసంగి 9:5, న్యూ అమెరికన్‌ బైబిల్‌) చనిపోయిన వ్యక్తికి ఎలాంటి స్పర్శ తెలియదు కాబట్టి పర్గేటరీలో ఉన్న అగ్ని చేత ఎలా శుద్ధి అవుతాడు?

  •   చనిపోయిన తర్వాత పాపాలకు శిక్ష ఉండదు. “పాపంవల్ల వచ్చే జీతం మరణం” అని, “చనిపోయిన వ్యక్తి పాపం నుండి విడుదల పొందాడు” అని బైబిలు చెప్తుంది. (రోమీయులు 6:7, 23, న్యూ అమెరికన్‌ బైబిల్‌) పాపం చేసినవాళ్లకు మరణానికి మించిన శిక్ష ఇంకొకటి లేదు.

a ఆర్ఫీయస్‌: ఎ జెనరల్‌ హిస్టరీ ఆఫ్‌ రిలిజియన్స్‌ అనే పుస్తకంలో పర్గేటరీ గురించి ఇలా ఉంది, “దానిగురించి సువార్త పుస్తకాల్లో ఒక్క మాట కూడా లేదు.” అదేవిధంగా, న్యూ క్యాథలి ఎన్సైక్లోపీడియా ఇలా చెప్తుంది: “చివరిగా తేలింది ఏంటంటే, పర్గేటరీ గురించిన క్యాథలి సిద్ధాంతం సంప్రదాయం నుండి పుట్టిందే గానీ, పవిత్ర లేఖనాల నుండి కాదు.”—సెకండ్‌ ఎడిషన్‌, 11వ సంపుటి, 825వ పేజీ.

b న్యూ క్యాథలి ఎన్సైక్లోపీడియా సెకండ్‌ ఎడిషన్‌లో 11వ సంపుటి, 824వ పేజీ చూడండి.