కంటెంట్‌కు వెళ్లు

యెహోవాసాక్షులు వైద్య చికిత్సలు చేయించుకుంటారా?

యెహోవాసాక్షులు వైద్య చికిత్సలు చేయించుకుంటారా?

 యెహోవాసాక్షులు తప్పకుండా వైద్య చికిత్సలు చేయించుకుంటారు, మందులు వాడతారు. మేము శరీరం పట్ల శ్రద్ధ తీసుకుంటాం, మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కృషి చేస్తాం. అయితే, కొన్నిసార్లు ‘వైద్యుని’ దగ్గరకు కూడా వెళ్తాం. (లూకా 5:31) నిజానికి మొదటి శతాబ్దంలో జీవించిన శిష్యుడైన లూకా లాగానే మాలో కూడా కొంతమంది డాక్టర్లు ఉన్నారు.—కొలొస్సయులు 4:14.

 కానీ కొన్నిరకాల వైద్య చికిత్సలు బైబిలు సూత్రాలకు విరుద్ధమైనవి, వాటిని మేము అంగీకరించం. ఉదాహరణకు మేము రక్తమార్పిడులకు ఒప్పుకోం, ఎందుకంటే శరీర పోషణ కోసం రక్తం తీసుకోవడం బైబిలుకు వ్యతిరేకం. (అపొస్తలుల కార్యములు 15:20) అలాగే మంత్రతంత్రాలకు సంబంధించిన వైద్య చికిత్సలను లేదా పద్ధతులను కూడా బైబిలు నిషేధిస్తుంది.—గలతీయులు 5:19-21.

 అయితే చాలా రకాలైన వైద్య చికిత్సలు బైబిలు సూత్రాలకు విరుద్ధమైనవి కావు. అందుకే ఈ విషయంలో ప్రతి ఒక్కరూ ఎవరికి వాళ్లే నిర్ణయించుకోవాలి. ఒక యెహోవాసాక్షి ఫలానా వైద్య చికిత్సను అంగీకరించే అవకాశం ఉంది, కానీ అదే చికిత్సను మరో సాక్షి తిరస్కరించే అవకాశం ఉంది.—గలతీయులు 6:5.