కంటెంట్‌కు వెళ్లు

యెహోవాసాక్షులు తమ నమ్మకాల్లో కొన్నిటిని ఎందుకు మార్చుకున్నారు?

యెహోవాసాక్షులు తమ నమ్మకాల్లో కొన్నిటిని ఎందుకు మార్చుకున్నారు?

 మా నమ్మకాలు పూర్తిగా బైబిలు మీదే ఆధారపడి ఉండాలని మేం కోరుకుంటాం. అందుకే, లేఖన అవగాహనలో మార్పులు వచ్చినప్పుడు, వాటికి అనుగుణంగా మా నమ్మకాల్ని కూడా మార్చుకుంటాం. a

 అలా మార్పు చేసుకోవడానికి కారణం, సామెతలు 4:18 లో ఉన్న బైబిలు సూత్రం. అదిలా చెప్తుంది: “పట్టపగలగువరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును.” సూర్యుడు ఉదయించే కొద్దీ, ఆ వెలుగులో పరిసరాలు మరింత స్పష్టంగా కనిపిస్తాయి. అలాగే, దేవుడు తాను అనుకున్న సమయంలో, క్రమక్రమంగా లేఖన సత్యాల్ని వెల్లడిచేస్తాడు. (1 పేతురు 1:10-12) బైబిలు ముందే చెప్పినట్లు, దేవుడు ఈ ‘అంత్యకాలములో’ మరింత ఎక్కువగా వాటిని తెలియజేస్తున్నాడు.—దానియేలు 12:4.

 లేఖన అవగాహనలో మార్పులు వచ్చినప్పుడు మేం ఆశ్చర్యపోం, లేదా కంగారుపడం. ప్రాచీనకాలంలోని దేవుని సేవకులు కూడా కొన్ని విషయాల్ని తప్పుగా అర్థం చేసుకున్నారు. తర్వాత దేవుడు వాటిని సరిచేశాడు.

  •   దేవుడు అనుకున్న సమయం కన్నా 40 సంవత్సరాల ముందే, మోషే ఇశ్రాయేలు జనాంగాన్ని విడిపించాలని ప్రయత్నించాడు.—అపొస్తలుల కార్యములు 7:23-25, 30, 35.

  •   మెస్సీయ చనిపోవడం, తిరిగి లేవడం గురించిన ప్రవచనాన్ని అపొస్తలులు అర్థం చేసుకోలేకపోయారు.—యెషయా 53:8-12; మత్తయి 16:21-23.

  •   మొదటి శతాబ్దంలో ఉన్న కొంతమంది క్రైస్తవులు, ‘ప్రభువు దినం’ గురించి తప్పుగా అర్థం చేసుకున్నారు.—2 థెస్సలొనీకయులు 2:1, 2.

 తర్వాత దేవుడు వాళ్ల అవగాహనల్ని సరిదిద్దాడు. ఇప్పుడు కూడా, దేవుడు మా విషయంలో అలాగే సరిదిద్దుతూ ఉండాలని ప్రార్థిస్తున్నాం.—యాకోబు 1:5.

a లేఖన అవగాహనల్లో మార్పులు వచ్చినప్పుడు మేం వాటిని దాటిపెట్టడానికి ప్రయత్నించం. బదులుగా, వాటిని భద్రపర్చి, ప్రచురిస్తాం. ఉదాహరణకు, వాచ్‌టవర్‌ ఆన్‌లైన్‌ లైబ్రరీలో “లేఖన అవగాహనలో వచ్చిన మార్పులు” అనే అంశాన్ని వెదకండి.