కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పత్రిక ముఖ్యాంశం

ప్రియమైనవాళ్లు చనిపోయినప్పుడు ...

ప్రియమైనవాళ్లు చనిపోయినప్పుడు ...

“మంచి ఏదో దేవునికి తెలుసు. ఏడవకు అమ్మా.”

భావన వాళ్ల నాన్న కార్‌ యాక్సిడెంట్‌లో చనిపోయినప్పుడు ఎవరో ఆమె చెవిలో పై మాటలు చెప్పారు.

భావనకు  a వాళ్ల నాన్న అంటే చాలా ఇష్టం. ఆమె దగ్గరి బంధువే ఆ మాటలు చెప్పారు. కానీ ఆ మాటలు ఆమెను ఓదార్చే బదులు ఇంకా గాయపర్చాయి. “ఆయన చనిపోవడం వల్ల మంచి ఏమీ జరగలేదు,” అని భావన మనసులో చాలాసార్లు అనుకుంది. చాలా సంవత్సరాలు గడిచాక ఆమె ఆ విషయాలను ఒక పుస్తకంలో రాసింది. అంత కాలం గడిచిపోయినా ఆమె ఇంకా బాధపడుతుందని అర్థమౌతుంది.

భావనకులానే, ఎవరికైనా మరణం వల్ల కలిగే బాధను తట్టుకోవడానికి చాలా సమయం పడుతుంది. ముఖ్యంగా వాళ్లు మనకు దగ్గరి వాళ్లైతే అది ఇంకా కష్టం. బైబిలు మరణాన్ని ఒక “శత్రువు” అని పిలుస్తుంది. (1 కొరింథీయులు 15:26) మరణాన్ని మనం ఆపలేం, అది బలవంతంగా మన జీవితంలో చొరబడిపోతుంది. మనం అసలు ఊహించనప్పుడు హఠాత్తుగా వచ్చి మనవాళ్లను మననుండి దూరం చేస్తుంది. ఈ ఘోరం నుండి ఎవరం తప్పించుకోలేం. కాబట్టి, మరణం వల్ల కలిగే బాధను ఎలా తట్టుకోవాలో, ఎలా మళ్లీ మామూలుగా అవ్వాలో సాధారణంగా ఎవరికీ తెలీదు.

మీరు ఈ విషయాలు గురించి ఆలోచించే ఉంటారు, ‘ఆ దుఃఖం నుండి బయటపడడానికి ఎంత సమయం పడుతుంది?’ ‘అసలు ఆ దుఃఖాన్ని ఎలా తట్టుకోవాలి?’ ‘అలాంటి పరిస్థితిలో ఉన్నవాళ్లను మనమెలా ఓదార్చాలి?’ ‘చనిపోయిన మనవాళ్లకు ఇక ఏ నిరీక్షణ లేనట్లేనా?’  (w16-E No. 3)

[అధస్సూచి]

a అసలు పేరు కాదు.