కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పత్రిక ముఖ్యాంశం | మీ అలవాట్లు మార్చుకోవాలనుకుంటున్నారా?

2. పరిస్థితుల్ని కూడా మీకు తగ్గట్టుగా మార్చుకోండి

2. పరిస్థితుల్ని కూడా మీకు తగ్గట్టుగా మార్చుకోండి
  • మీరు మంచి ఆహారం తీసుకోవాలని నిర్ణయించుకున్నారు, కానీ ఐస్‌క్రీమ్‌ డబ్బా చూసినప్పుడల్లా అది మీ కోసమే ఉన్నట్లు అనిపిస్తుంది.

  • మీరు సిగరెట్‌ మానేయాలని అనుకున్నారు, అది తెలిసి కూడా మీ ఫ్రెండ్‌ మీకు మళ్లీ ఒక సిగరెట్‌ ఇస్తాడు.

  • మీరు ఎక్సర్‌సైజ్‌ చేయాలని అనుకుంటారు, కానీ వాకింగ్‌ షూస్‌ వెదికి తీసుకోవడం కూడా మీకు చాలా కష్టంగా ఉంది!

వీటన్నిటిలో విషయం ఒకటే! అదేంటో మీకు అర్థమైందా? మన చుట్టూ ఉండే పరిస్థితుల, మనుషుల ప్రభావం మనపైన చాలావరకు ఉంటుంది. అనుభవాలు చూపిస్తున్నట్లు ప్రతిసారి వాటివల్లే మనం మంచి అలవాట్లు పెంచుకోవచ్చు, లేదా చెడు అలవాట్లు మానుకోవచ్చు.

మంచి సలహా: “బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగును జ్ఞానములేనివారు యోచింపక ఆపదలో పడుదురు.”సామెతలు 22:3.

ముందే ఆలోచించుకోమని బైబిలు మనకు సలహా ఇస్తుంది. అప్పుడు చెడు అలవాట్లను మార్చుకోవడానికి కష్టమయ్యే పరిస్థితుల్ని జాగ్రత్తగా తప్పించుకుంటాము. మంచి అలవాట్లు నేర్చుకోవడానికి సహాయం చేసే మంచి పరిస్థితుల్ని కల్పించుకుంటాము. (2 తిమోతి 2:22) అంటే మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని తెలివిగా మన అలవాట్లకు తగ్గట్టు మార్చుకోవాలి. (g16-E No. 4)

చెడు పని చేయడం కష్టమయ్యేలా, మంచిపని చేయడం సులువయ్యేలా చూసుకోండి

ఇలా చేయండి

  • చేయవద్దు అనుకున్న పని చేయడం మీకు చాలా కష్టమైపోవాలి. ఉదాహరణకు మీరు చిరుతిళ్లు తినకుండా ఉండాలనుకుంటే, అసలు అలాంటి వాటిని మీ ఇంట్లో పెట్టుకోకండి. అప్పుడు తినడం కష్టమైపోతుంది, తినకుండా ఉండడం ఈజీ అయిపోతుంది.

  • మంచి అలవాట్లు పెంచుకోవడం సులువు అయ్యేలా చూసుకోండి. ఉదాహరణకు రోజు ప్రొద్దున్నే లేవగానే ఎక్సర్‌సైజ్‌ చేయాలనుకుంటే, ఎక్సర్‌సైజ్‌ కోసం వేసుకునే బట్టల్ని ముందు రోజు రాత్రే మీ మంచం ప్రక్కన పెట్టుకుని పడుకోండి. మొదలు పెట్టడం సులువైతే, దాన్ని కొనసాగించడం కూడా సులువౌతుంది.

  • ఎవరితో స్నేహం చేయాలో జాగ్రత్తగా ఆలోచించుకోండి. మనం ఎవరితో ఎక్కువ సమయం గడుపుతామో వాళ్లలా అయిపోయే అవకాశం ఎక్కువ. (1 కొరింథీయులు 15:33) కాబట్టి మీరు మానుకోవాలనుకుంటున్న అలవాట్లను పెంచే వాళ్లతో స్నేహం తగ్గించుకోండి. మీలో మంచి అలవాట్లు పెంచే వాళ్లతో స్నేహం చేయండి.