కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ప్రపంచ విశేషాలు

అమెరికా ఖండంలో విశేషాలు

అమెరికా ఖండంలో విశేషాలు

పశ్చిమార్ధ గోళంలో ఉన్న దేశాల వార్తావిశేషాలు. కాలాతీతమైన బైబిల్‌ జ్ఞానంకున్న విలువను అవి చూపిస్తాయి.

టెన్షన్‌ తగ్గించుకోవాలా—ఈ-మెయిల్‌ తక్కువగా చూడండి

ఎక్కువసార్లు ఈ-మెయిల్‌ చెక్‌ చేసుకుంటూ ఉండే బదులు రోజుకు మూడుసార్లు మాత్రమే ఈ-మెయిల్‌ చూసుకుంటే టెన్షన్‌ తగ్గవచ్చని వాంకోవర్‌, కెనడాలో జరిగిన పరిశోధనలో తేలింది. ఈ పరిశోధనకు నాయకత్వం వహించిన కొస్టాడిన్‌ కూష్‌లెవ్‌, అందులో వచ్చిన ఫలితాలను బట్టి ఇలా చెప్తున్నాడు: “మాటిమాటికి ఈ-మెయిల్‌ చూసుకోకుండా ఉండడం కష్టమే కానీ ఆ అలవాటు నుండి బయటపడితే టెన్షన్‌ తగ్గించుకోవచ్చు.”

ఒకసారి ఆలోచించండి: మనం “అపాయకరమైన” కాలాల్లో జీవిస్తున్నాం, కాబట్టి మనం టెన్షన్‌ తగ్గించుకునే మార్గాల కోసం వెతకడం అవసరమా కాదా?—2 తిమోతి 3:1.

చేపలు అంతరించిపోకుండా ఆపారు

కెరీబియన్‌లోని బెలిజ్‌, మరితర ప్రాంతాల్లో ‘ప్రకృతి వనరులు అంతరించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. దానివల్ల కాన్చ్‌, లాబ్‌స్టర్‌ లాంటి సముద్ర జీవుల సంఖ్య, చేపల సంఖ్య పెరిగినట్లు రుజువులున్నాయి’ అని ద వైల్డ్‌లైఫ్‌ కన్సర్వేషన్‌ సొసైటీ (WCS) రిపోర్టులు చెబుతున్నాయి. ఆ రిపోర్టులో ఇంకా ఇలా ఉంది, “చేపలు పట్టకుండా అదుపు చేసిన ప్రాంతాల్లో, 1-6 సంవత్సరాల్లోనే అంతరించి పోతున్న కొన్ని రకాల జీవులను బ్రతికించడం వీలౌతుంది, కానీ వీటిని పూర్తిగా సంరక్షించడానికి ఎన్నో సంవత్సరాలు పట్టవచ్చు.” జానెట్‌ గిబ్‌సన్‌ అనే WCS కార్యక్రమ నిర్వాహకురాలు (program director) బెలిజ్‌ గురించి ఇలా అంది, “చేపలు పట్టకుండా అదుపు చేసిన ప్రాంతాల వల్ల దేశంలో చేపల వనరులు మళ్లీ పెరిగి జీవవైవిధ్యం (biodiversity) మెరుగుపడుతుంది.”

ఒకసారి ఆలోచించండి: సొంతగా కోలుకునే శక్తి ఉన్న ఈ ప్రకృతి ఒక తెలివైన సృష్టికర్త ఉన్నాడని చూపిస్తుంది కదా!—కీర్తన 104:24, 25.

బ్రెజిల్‌లో పెరుగుతున్న హింస

బ్రెజిల్‌లో హింస పెరిగిపోతుందని ఆషెన్సీయా బ్రెజల్‌ అనే వార్తా సంస్థ చెప్తుంది. 2012లో హత్యల సంఖ్య 56,000 దాటిపోయింది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రతి సంవత్సరం నమోదు చేసిన సంఖ్యల్లో అత్యధిక సంఖ్య ఇదే. ఈ సంఖ్య నైతికంగా దిగజారడాన్ని చూపిస్తుందని ప్రజా భద్రతలో నిపుణుడైన లూయిస్‌ సాపోరి నమ్ముతున్నాడు. నాగరిక సమాజంలో ఉండే చట్టాల మీద ప్రజలకు ఒకసారి గౌరవం పోయాక, “దౌర్జన్యంగా వాళ్ల ఇష్టాన్ని నెరవేర్చుకోవడం మొదలు పెడతారు,” అని ఆయన అన్నాడు.

మీకు తెలుసా? అవినీతి పెరుగుతుందని, చాలామంది ప్రేమ చల్లారిపోయే కాలం వస్తుందని బైబిల్లో ముందే ఉంది.—మత్తయి 24:3, 12. (g16-E No. 5)