కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

హింస

హింస

హింస

మానవ చరిత్రంతా హింసతో నిండిపోయింది. ముందుముందు కూడా అలానే ఉంటుందా?

హింసను దేవుడు ఇష్టపడతాడా?

అందరూ ఏమంటున్నారు . . .

ఎవరైనా రెచ్చగొట్టితే జవాబుగా హింసించడమే సరైనదని దైవభక్తి ఉన్న వాళ్లతో సహా చాలామంది అంటారు. అంతేకాదు టీవీల్లో, సినిమాల్లో హింస చూపించినా ఫర్వాలేదని లక్షలమంది అంటున్నారు.

దేవుడు ఏమంటున్నాడు . . .

ఉత్తర ఇరాక్‌లో మోసుల్‌ అనే పట్టణం దగ్గర కొన్ని శిథిలాలు కనిపిస్తాయి. అవి పురాతన కాలంలో అష్షూరు సామ్రాజ్యానికి రాజధానిగా ఉన్న నీనెవె పట్టణ శిథిలాలు. అది చాలా గొప్ప పట్టణం. అయినా అది నాశనం అవుతుందని దేవుడు చెప్పాడు. (జెఫన్యా 2:13) “నిన్ను అవమానపరచెదను” అని కూడా అన్నాడు. ఎందుకు? ఎందుకంటే నీనెవె “నరహత్య చేసిన పట్టణము.” (నహూము 1:1; 3:1, 6) “నరహత్య జరిగించువారు యెహోవాకు అసహ్యులు” అని కీర్తన 5:6⁠లో ఉంది. నీనెవె శిథిలాలు చూస్తే దేవుడు చెప్పినట్టే చేశాడని తెలుస్తుంది.

‘నరహంతకుడు’ అని యేసు పిలిచిన సాతానుతోనే హింస మొదలైంది. మనుషులకు, దేవునికి ముఖ్య శత్రువు ఆ సాతానే. (యోహాను 8:44) అంతేకాదు, ‘లోకమంతయు దుష్టుని యందున్నది’ కాబట్టే, లోకం ఆలోచించే విధానంలో అంటే సినిమాల్లో, టీవీల్లో చూపించే హింసను ప్రజలు ఆనందించడంలో ఈ దుష్టుని లక్షణాలు కనిపిస్తున్నాయి. (1 యోహాను 5:19) దేవుడు మనల్ని ఇష్టపడాలంటే, మనం హింసను అసహ్యించుకోవాలి, ఆయన ఇష్టపడే వాటిని ఇష్టపడాలి. a అది సాధ్యమేనా?

‘బలాత్కారాసక్తులు యెహోవాకు అసహ్యులు.’కీర్తన 11:5.

హింసించే వాళ్లు మారడం సాధ్యమేనా?

అందరూ ఏమంటున్నారు . . . 

హింసించే గుణం మనుషుల్లో సహజంగానే ఉంటుంది, దాన్ని మార్చలేం.

దేవుడు ఏమంటున్నాడు . . .

“కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, . . . బూతులు” వంటివాటిని విడిచి పెట్టమని దేవుడు చెప్తున్నాడు. పాత స్వభావాన్ని అలవాట్లను తీసివేసుకుని, కొత్త స్వభావాన్ని అలవాటు చేసుకోమని కూడా చెప్తున్నాడు. (కొలొస్సయులు 3:8-10) దేవుడు మననుండి మరీ ఎక్కువ కోరుతున్నాడా? లేదు. అలాంటివి మానుకోవడం సాధ్యమే. b ఎలా?

మొదట చేయాల్సింది దేవుని గురించి నిజమైన జ్ఞానాన్ని తెలుసుకోవడం. (కొలొస్సయులు 3:10) తెలుసుకోవాలనే మనసున్న వ్యక్తి మన సృష్టికర్తకున్న మంచి గుణాలను, ఆయన ఇచ్చిన సూత్రాలను నేర్చుకున్నప్పుడు, ప్రేమతో ఆయనకు దగ్గరౌతాడు. ఆయన ఇష్టపడే వాటినే చేస్తాడు.—1 యోహాను 5:3.

రెండవదిగా, మనం ఎలాంటి వాళ్లతో ఉంటున్నామో చూసుకోవాలి. ‘కోపచిత్తునితో సహవాసం చేయకు క్రోధముగలవానితో పరిచయం కలిగి ఉండకు. నీవు వాని మార్గములను అనుసరించి నీ ప్రాణమునకు ఉరి తెచ్చుకొందువేమో.’—సామెతలు 22:24, 25.

మాడవదిగా, విషయాలను లోతుగా ఆలోచించి, అర్థం చేసుకోవాలి. హింస గురించి లోతుగా ఆలోచిస్తే, నిజానికి అది మనపై మనకు అదుపు లేకపోవడం అనే బలహీనత. కానీ, శాంతంగా ఉన్నవాళ్లకు మనో బలం ఉంటుంది. “పరాక్రమశాలికంటె దీర్ఘశాంతముగలవాడు శ్రేష్ఠుడు” అని సామెతలు 16:32లో ఉంది.

“అందరితో సమాధానము . . . కలిగి యుండుటకు ప్రయత్నించుడి.”హెబ్రీయులు 12:14.

హింస ఉండని కాలం ఎప్పటినా వస్తుందా?

అందరూ ఏమంటున్నారు ...

హింస ఎప్పటినుండో ఉంది, ఎప్పటికీ ఉంటుంది.

దేవుడు ఏమంటున్నాడు ...

“ఇక కొంతకాలమునకు భక్తిహీనులు లేకపోవుదురు ... దీనులు భూమిని స్వతంత్రించుకొందురు బహు క్షేమము కలిగి సుఖించెదరు.” (కీర్తన 37:10, 11) పురాతన నీనెవె పట్టణాన్ని నాశనం చేసినట్టు హింసను ప్రేమించేవాళ్లను నాశనం చేసి శాంతంగా ఉండేవాళ్లను, దీనులను దేవుడు కాపాడతాడు. అప్పుడు ఇక, ఈ భూమ్మీద శాంతిని పాడుచేసే హింస ఎప్పటికీ ఉండదు.—కీర్తన 72:7.

“సాత్వికులు ... భూలోకమును స్వతంత్రించుకొందురు.”—మత్తయి 5:5

కాబట్టి దేవుడు మనల్ని ఇష్టపడేలా ఇప్పుడే శాంత స్వభావాన్ని పెంచుకోవాలి. దేవుడు, ‘ఎవడును నశింపవలెనని ఇష్టపడక, అందరూ మారుమనస్సు పొందవలెనని కోరుతూ, మీ పట్ల దీర్ఘశాంతముగలవాడై ఉన్నాడు’ అని 2 పేతురు 3:9లో ఉంది. ◼ (g15-E 05)

“వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ యీటెలను మచ్చుకత్తులుగాను సాగగొట్టుదురు.”యెషయా 2:4.

a పురాతన కాలంలో, దేశాన్ని కాపాడుకోవడానికి ఇశ్రాయేలీయులను దేవుడు యుద్ధం చేయనిచ్చాడు. (2 దినవృత్తాంతములు 20:15, 17) అయితే ఇప్పుడు దేవుడు అలా యుద్ధం చేయమనడం లేదు. ఎందుకంటే, ఆయన ఇశ్రాయేలుతో చేసిన ఒప్పందాన్ని రద్దు చేసి, ఎలాంటి సరిహద్దులు లేని క్రైస్తవ సంఘాన్ని ఏర్పాటు చేశాడు.

b తమ స్వభావాన్ని మార్చుకున్న చాలామంది ఉదాహరణలను కావలికోట పత్రికలో “బైబిలు జీవితాలను మారుస్తుంది” ఆర్టికల్స్‌లో చదవవచ్చు.

ఇలాంటి ప్రశ్నల జవాబుల కోసం www.mr1310.com/te చూడండి