కావలికోట—అధ్యయన ప్రతి అక్టోబరు 2014

ఈ సంచికలో 2014, డిసెంబరు 1 నుండి 28 వరకూ జరిగే అధ్యయన ఆర్టికల్స్‌ ఉన్నాయి.

తమ జీవితాల్ని సంతోషంగా అంకితం చేశారు—తైవాన్‌లో

రాజ్య ప్రచారకుల అవసరం ఎక్కువున్న ఈ ప్రాంతంలో సేవచేయడానికి 100 కన్నా ఎక్కువమంది యెహోవాసాక్షులు వచ్చారు. వాళ్ల అనుభవాలు చదివి ఆనందించండి, విజయం సాధించడానికి కావాల్సిన మెళుకువలు నేర్చుకోండి.

రాజ్యంపై అచంచలమైన విశ్వాసం ఉంచండి

తన రాజ్యం తన సంకల్పాన్ని నెరవేరుస్తుందనే హామీ ఇవ్వడం కోసం యెహోవా ఒకదాని తర్వాత ఒకటిగా ఆరు నిబంధనలు చేశాడు. మన విశ్వాసాన్ని బలపర్చుకోవడానికి ఆ నిబంధనలు ఎలా సహాయం చేస్తాయి?

మీరు “యాజక రూపమైన రాజ్యముగా” ఉంటారు

ఆరు నిబంధనల్లోని చివరి మూడు నిబంధనలు దేవుని రాజ్యంపై విశ్వాసం ఉంచేలా, దాని గురించిన సువార్తను ఇతరులకు ప్రకటించేలా మనల్ని పురికొల్పుతాయి.

జీవిత కథ

సువార్తికురాలిగా నా జీవితంలో మైలురాళ్లు

ఎల్‌ సాల్వడార్‌లో చేసిన 29 ఏళ్ల మిషనరీ సేవతోపాటు, మిల్‌డ్రడ్‌ ఓల్‌సన్‌ 75 ఏళ్ల కంటే ఎక్కువకాలం యెహోవాను సేవించింది. ఆమె దేనివల్ల యౌవనురాలినని అనుకుంటుంది?

యెహోవాతో పనిచేసే అవకాశాన్ని అమూల్యంగా ఎంచండి!

యెహోవాను ఆరాధించేవాళ్లు వ్యక్తిగత ఇష్టాలను పక్కన పెట్టేలా ఏది పురికొల్పుతుంది?

‘పైనున్న వాటిమీద మనసుపెట్టండి’

భూమ్మీద నిత్యం జీవించే నిరీక్షణ ఉన్నవాళ్లు పరలోకంలోని విషయాలపై ఎందుకు మనసు పెట్టాలి? వాళ్లు ఆ పనిని ఎలా చేయవచ్చు?