కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీరు ఎప్పుడైనా ఆలోచించారా?

మీరు ఎప్పుడైనా ఆలోచించారా?

మీ పిల్లలకు దేవున్ని ప్రేమించడం ఎలా నేర్పించవచ్చు?

సృష్టిని చూపిస్తూ దేవున్ని తెలుసుకుని ఆయనను ప్రేమించడానికి మీ పిల్లలకు సహాయం చేయండి

దేవుడు ఉన్నాడని, వాళ్లను ప్రేమిస్తున్నాడని నమ్మితేనే పిల్లలు దేవున్ని ప్రేమించడం నేర్చుకుంటారు. దేవున్ని ప్రేమించాలంటే పిల్లలు ఆయన గురించి తెలుసుకోవాలి. (1 యోహాను 4:8) ఉదాహరణకు, దేవుడు మనుషుల్ని ఎందుకు చేశాడు? దేవుడు కష్టాలను ఎందుకు తీసేయట్లేదు? భవిష్యత్తులో మనుషుల కోసం దేవుడు ఏమి చేస్తాడు? వంటివి వాళ్లు తెలుసుకోవాలి.ఫిలిప్పీయులు 1:9-11 చదవండి.

మీ పిల్లలు దేవున్ని ప్రేమించడం నేర్చుకోవాలంటే, మీరు కూడా దేవున్ని ప్రేమిస్తున్నారని వాళ్లకు చూపించాలి. అప్పుడు మిమ్మల్ని చూసి నేర్చుకుంటారు.ద్వితీయోపదేశకాండము 6:5-7; సామెతలు 22:6 చదవండి.

మీ పిల్లల హృదయాలను ఎలా చేరుకోవచ్చు?

దేవుని వాక్యానికి చాలా బలం ఉంది. (హెబ్రీయులు 4:12) కాబట్టి అందులోని ప్రాథమిక విషయాలు పిల్లలకు నేర్పించండి. ప్రజల హృదయాలను చేరుకోవడానికి యేసు ప్రశ్నలు అడిగాడు, వాళ్లు చెప్పేది విన్నాడు, దేవుని వాక్యాన్ని వివరించాడు. మీరు కూడా మీ పిల్లల హృదయాలను చేరుకోవడానికి యేసు నేర్పించిన విధానాన్ని పాటించవచ్చు.లూకా 24:15-19, 27, 32 చదవండి.

అంతేకాకుండా, దేవుడు ప్రజలను ఎలా చూసుకున్నాడో చెప్పే బైబిలు వృత్తాంతాలు కూడా దేవున్ని తెలుసుకుని ఆయనను ప్రేమించడానికి పిల్లలకు సహాయం చేస్తాయి. అలా నేర్పించడానికి ఉపయోగపడే ప్రచురణలు www.mr1310.com/te వెబ్‌సైట్‌లో ఉన్నాయి.2 తిమోతి 3:16, 17 చదవండి. (w14-E 12/01)