కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

146వ పాట

“అన్నిటినీ కొత్తవిగా చేస్తున్నాను”

“అన్నిటినీ కొత్తవిగా చేస్తున్నాను”

(ప్రకటన 21:1-5)

  1. 1. యెహోవా పాలన ఆరంభమైంది.

    ఆయన పుత్రుడు రాజయ్యాడు.

    పరలోకంలో గెలుపొందాడు,

    భూమ్మీద తండ్రి చిత్తం చేస్తాడు.

    (పల్లవి)

    తోడై ఉంటాడు దేవుడు,

    నిత్యం మనతో ఉంటాడు.

    ఏడుపు వేదనలుండవిక,

    మరణ దుఃఖాలు ఉండవిక.

    చేస్తాడు సమస్తాన్ని నూతనం.

    ఈ మాటలు వాస్తవం.

  2. 2. కొత్త యెరూషలేమును చూడండి.

    గొర్రెపిల్లకు ఆమె వధువు.

    దేదీప్యముగా వెలుగుతోంది,

    దైవ మహిమే ఆమె వెలుగు.

    (పల్లవి)

    తోడై ఉంటాడు దేవుడు,

    నిత్యం మనతో ఉంటాడు.

    ఏడుపు వేదనలుండవిక,

    మరణ దుఃఖాలు ఉండవిక.

    చేస్తాడు సమస్తాన్ని నూతనం.

    ఈ మాటలు వాస్తవం.

  3. 3. సంతోషము తెచ్చు ఆ పట్టణపు

    ద్వారాలెప్పుడూ తెరిచుంటాయి.

    దాని కాంతిలో జనులుంటారు,

    వెదజల్లుదాం మనం ఆ కాంతి.

    (పల్లవి)

    తోడై ఉంటాడు దేవుడు,

    నిత్యం మనతో ఉంటాడు.

    ఏడుపు వేదనలుండవిక,

    మరణ దుఃఖాలు ఉండవిక.

    చేస్తాడు సమస్తాన్ని నూతనం.

    ఈ మాటలు వాస్తవం.

(మత్త. 16:3; ప్రక. 12:7-9; 21:23-25 కూడా చూడండి.)