కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

Kim Steele/The Image Bank via Getty Images

ఆర్థిక సమస్యలు—దేవుని రాజ్యం ఏం చేస్తుంది?

ఆర్థిక సమస్యలు—దేవుని రాజ్యం ఏం చేస్తుంది?

 ప్రపంచంలో చాలామంది ఎంత కష్టపడినా, తమ కనీస అవసరాలకు సరిపడా డబ్బును సంపాదించలేకపోతున్నారు. ఈ సమస్య రోజురోజుకీ పెరిగిపోతోంది.

  •   ఈమధ్యే వచ్చిన ఒక గ్లోబల్‌ రిపోర్ట్‌, a “ప్రజల నెలసరి జీతం బాగా తగ్గిపోయింది” అని చెప్తోంది. ఈ సమస్యను పరిష్కరించకపోతే ధనవంతులు-పేదవాళ్ల మధ్య తేడా ఇంకా పెరిగిపోతుంది, చాలీచాలని డబ్బులతో తమ కుటుంబాన్ని నెట్టుకురావల్సిన పరిస్థితి చాలామందికి వస్తుందని కూడా ఆ రిపోర్ట్‌ హెచ్చరించింది.

 ప్రభుత్వాలు ఈ ఆర్థిక సమస్యల్ని పరిష్కరించగలుగుతాయా? కనీసం తగ్గించగలుగుతాయా?

 ధనవంతులు-పేదవాళ్లు అనే తేడాల్ని తీసేయడంతో పాటు, ఆర్థిక సమస్యలన్నీ పరిష్కరించే ఒక ప్రభుత్వం గురించి బైబిలు చెప్తోంది. భూమ్మీదున్న వాళ్లందరి బాగోగుల్ని చూసుకోవడానికి “పరలోకంలో ఉన్న దేవుడు ఒక రాజ్యాన్ని (లేదా, ప్రభుత్వాన్ని) స్థాపిస్తాడు” అని బైబిలు చెప్తోంది. (దానియేలు 2:44) ఆ ప్రభుత్వం ప్రతీ ఒక్కర్ని పట్టించుకుంటుంది, ఎవ్వర్నీ నిర్లక్ష్యం చేయదు. (కీర్తన 9:18) అప్పుడు ప్రజలందరూ సంతోషంగా ఉంటారు. ప్రతీ ఒక్కరు తమ కష్టానికి తగిన ఫలితాన్ని పూర్తిగా ఆనందిస్తారు.—యెషయా 65:21, 22.

a ఇంటర్నేషనల్‌ లేబర్‌ ఆర్గనైజేషన్‌ గ్లోబల్‌ వేజ్‌ రిపోర్ట్‌ 2022-23