కంటెంట్‌కు వెళ్లు

ఎడమవైపు: 1946​లో బగోటాలోని సహోదర సహోదరీల్ని సందర్శించిన నేథన్‌ హెచ్‌. నార్‌, ఫ్రెడ్‌రిక్‌ ఫ్రాంజ్‌. కుడివైపు: కొలంబియాలోని మిషనరీలు (పై వరుసలో, ఎడమ నుండి కుడికి) ఒలాఫ్‌ ఓల్సన్‌, జేమ్స్‌ వెబ్‌స్టర్‌, క్విన్‌ డేల్‌ లాడర్‌డేల్‌; (కింద వరుసలో, ఎడమ నుండి కుడికి) అన్నే లాడర్‌డేల్‌, హెలెన్‌ లాంగ్‌ఫోర్డ్‌, జ్యువెల్‌ హార్పర్‌

ఏప్రిల్‌ 12, 2022
కొలంబియా

కొలంబియాలో యెహోవాసాక్షుల వందేళ్ల చరిత్ర

కొలంబియాలో యెహోవాసాక్షుల వందేళ్ల చరిత్ర

2022 సంవత్సరంతో, కొలంబియాలో యెహోవాసాక్షుల ప్రయాణం మొదలై వందేళ్లవుతుంది.  a

హెలియోడోరో హెర్నాండెజ్‌

బైబిల్ని ప్రతీరోజు ఆసక్తిగా చదివే అలవాటు ఉన్న హెలియోడోరో హెర్నాండెజ్‌ 1922​లో, యెహోవాసాక్షి కాని తన స్నేహితుని దగ్గర చాలా కావలికోట పత్రికల్ని తీసుకుని చదివాడు. దాంతో కొన్నిరోజులకే హెలియోడోరో సత్యాన్ని గుర్తించి, దాన్ని ఇతరులతో పంచుకోవడం మొదలుపెట్టాడు. అలా రెండేళ్ల తర్వాత జువాన్‌ ఎస్టూపినాన్‌ని కలిశాడు. అప్పటినుండి వాళ్లిద్దరు కలిసి మంచివార్తను ప్రకటించారు, 1932​లో వాళ్లిద్దరూ బాప్తిస్మం తీసుకున్నారు.

జువాన్‌ ఎస్టూపినాన్‌

కొంతకాలానికి హెర్నాండెజ్‌, ఎస్టూపినాన్‌కి కావలికోట సంస్థ ఒక మెషీన్‌ని పంపించింది. వాళ్లు ఆ మెషీన్‌ సహాయంతో, “త్రిత్వానికి ఉన్న ముసుగు వీడింది” “లోకాంతం” వంటి బైబిలు ప్రసంగాల్ని రికార్డు చేసి ఆండీస్‌ పర్వత ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరికీ వినిపించారు. ఆ ప్రాంతాల్లో క్యాథలిక్‌ చర్చీ ప్రభావం ఎక్కువగా ఉండేది కాబట్టి తరచూ వాళ్లకు వ్యతిరేకత ఎదురౌతూ ఉండేది.

1945​లో గిలియడ్‌ పాఠశాల నుండి శిక్షణ పొందిన మిషనరీలు వచ్చారు. వాళ్లలో ఒకరైన సహోదరుడు ఒలాఫ్‌ ఓల్సన్‌ తన జీవిత కథలో ఇలా చెప్పాడు: “ఇక్కడ యెహోవా గొర్రెలు చాలా ఉన్నాయి, వాటిని వెదకడానికి అలాగే ఆధ్యాత్మిక ఆహారం పెట్టడానికి మమ్మల్ని పంపినందుకు మేము చాలా సంతోషిస్తున్నాం.”

తర్వాత, ఆ పని మరింత క్రమపద్ధతిలో జరిగేలా చేయడానికి కొలంబియాలో బ్రాంచి ఆఫీసును ఏర్పాటు చేశారు. అది 1946, మే 1 నుండి పని చేయడం మొదలైంది. అక్కడ మొదటి బ్రాంచి సేవకుడైన సహోదరుడు ఆర్థర్‌ గ్రీన్‌ ఇలా రాశాడు: “యెహోవా గొప్ప శక్తి వల్లే, కొలంబియాలో సత్యారాధన స్థాపించబడుతుంది.”

ఈ రోజు కొలంబియాలో దాదాపు 1,90,000 మంది యెహోవాసాక్షులు ఉత్సాహంగా మంచివార్తను ప్రకటిస్తున్నారు.

సారవంతమైన నేలకు, అందమైన రత్నాలకు కొలంబియా పెట్టింది పేరు. కానీ దాని అసలైన అందం ‘విలువైన వస్తువుల్ని’ అంటే, ప్రజల్ని యెహోవా తనవైపు ఆకర్షించుకుంటూ ఉండడంలో కనిపిస్తుంది. యెహోవా పరిచర్య పని ద్వారా ‘తన మందిరాన్ని మహిమతో నింపడాన్ని’ చూస్తుంటే, ఆయన ఆ పనిని ఆశీర్వదిస్తూనే ఉన్నాడని అర్థమవుతుంది. అది నిజంగా మనకు సంతోషాన్నిస్తుంది.—హగ్గయి 2:7.

a 1931​లో బైబిలు విద్యార్థులకు యెహోవాసాక్షులు అనే పేరు వచ్చింది.