కంటెంట్‌కు వెళ్లు

ప్రపంచ శాంతి—ఎందుకు పగటి కలగానే మిగిలిపోతోంది?

ప్రపంచ శాంతి—ఎందుకు పగటి కలగానే మిగిలిపోతోంది?

బైబిలు ఇచ్చే జవాబు

 ప్రపంచ శాంతి తీసుకురావాలని మనుషులు చేస్తున్న ప్రయత్నాలు విఫలం అవ్వడానికి ఎన్నో కారణాలు:

  •   “తమ మార్గము నేర్పరచుకొనుట నరులవశములో లేదు.” (యిర్మీయా 10:23) మనల్ని మనం పరిపాలించుకునే సామర్థ్యంతో మనం సృష్టించబడలేదు. అందుకే, నిరంతరము నిలిచే శాంతిని తీసుకురావడం మనవల్ల కాదు.

  •   “రాజులచేతనైనను నరులచేతనైనను రక్షణ కలుగదు వారిని నమ్ముకొనకుడి వారి ప్రాణము వెడలిపోవును వారు మంటిపాలగుదురు వారి సంకల్పములు నాడే నశించును.” (కీర్తన 146:3, 4) మంచి ఉద్దేశాలున్న అధికారులు కూడ యుద్ధానికి దారితీసే మూల కారణాలను తీసివేయలేకపోతున్నారు.

  •   “అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలిసికొనుము. ఏలాగనగా మనుష్యులు ... క్రూరులు, సజ్జనద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు.” (2 తిమోతి 3:1-4) ఇలాంటి ప్రజలు ఎక్కువగా ఉన్న చెడు లోకం నాశనం కాబోయే ఈ ‘చివరి రోజుల్లో’ శాంతిని తీసుకురావడం మరీ కష్టంగా ఉంది.

  •   “భూమీ, సముద్రమా, మీకు శ్రమ; అపవాది తనకు సమయము కొంచెమే అని తెలిసికొని బహు క్రోధముగలవాడై మీయొద్దకు దిగివచ్చియున్నాడు.” (ప్రకటన 12:12) దేవుని శత్రువైన సాతాను ఈ భూమికే పరిమితం చేయబడ్డాడు, ప్రజలు కూడా తనలాగే క్రూరంగా తయారయ్యేలా చేస్తున్నాడు. అతడు ‘ఈ లోకాధికారిగా’ ఉన్నంత కాలం మనం ప్రశాంతంగా జీవించలేం. (యోహాను 12:31)

  •   “ఆ రాజ్యము [దేవుని రాజ్యము] ... ముందు చెప్పిన రాజ్యములన్నిటిని [దేవుని ఎదిరించే రాజ్యాలన్నిటిని] పగులగొట్టి నిర్మూలము చేయును గాని అది యుగముల వరకు నిలుచును.” (దానియేలు 2:44) నిరంతరం నిలిచే ప్రపంచ శాంతి కావాలనే మన కోరికను కేవలం దేవుని ప్రభుత్వం మాత్రమే తీరుస్తుంది, మరే మానవ ప్రభుత్వం తీర్చలేదు.—కీర్తన 145:16.