కీర్తనలు 2:1-12

  • యెహోవా, ఆయన అభిషిక్తుడు

    • యెహోవా దేశాల్ని చూసి నవ్వుతాడు (4)

    • యెహోవా తన రాజును ఆసీనుణ్ణి చేశాడు (6)

    • కుమారుణ్ణి ఘనపర్చండి (12)

2  దేశాలు ఎందుకు అల్లకల్లోలంగా ఉన్నాయి?దేశదేశాల ప్రజలు ఎందుకు వ్యర్థమైన పన్నాగాలు పన్నుతున్నారు?*+   భూరాజులు యెహోవాకు, ఆయన అభిషిక్తునికి*+వ్యతిరేకంగా నిలబడ్డారు,ఉన్నతాధికారులు వాళ్లకు వ్యతిరేకంగా పోగయ్యారు.*+   వాళ్లు ఇలా అంటున్నారు: “వాళ్ల సంకెళ్లను తెంచేసుకుందాం,వాళ్ల తాళ్లను తీసిపారేద్దాం!”   అయితే పరలోకంలో సింహాసనం మీదున్న దేవుడు నవ్వుతాడు;యెహోవా వాళ్లను చూసి ఎగతాళి చేస్తాడు.   ఆ సమయంలో ఆయన కోపంగా వాళ్లతో మాట్లాడతాడు,కోపాగ్నితో వాళ్లను భయకంపితుల్ని చేస్తాడు,   ఆయన ఇలా అన్నాడు: “నా పవిత్ర పర్వతమైన సీయోను+ మీదనేనే నా రాజును ఆసీనుణ్ణి చేశాను.”+   నేను యెహోవా శాసనాన్ని చాటిస్తాను;ఆయన నాతో ఇలా అన్నాడు: “నువ్వు నా కుమారుడివి;+ఈ రోజు నేను నీకు తండ్రిని అయ్యాను.+   నన్ను అడుగు, దేశాల్ని నీకు ఆస్తిగా,భూమంతటినీ నీకు సొత్తుగా ఇస్తాను.+   నువ్వు ఇనుప దండంతో వాటిని నలగ్గొడతావు,+కుండను పగలగొట్టినట్టు ముక్కలుముక్కలు చేస్తావు.”+ 10  కాబట్టి రాజులారా, లోతైన అవగాహన చూపించండి;భూమ్మీది న్యాయమూర్తులారా, దిద్దుబాటును స్వీకరించండి.* 11  భయపడుతూ యెహోవాను సేవించండి,వణుకుతూ సంతోషించండి. 12  కుమారుణ్ణి ఘనపర్చండి,*+ లేకపోతే దేవునికి* కోపం వస్తుంది,అప్పుడు మీరు నాశనం చేయబడి నీతి మార్గం నుండి తొలగించబడతారు,+ఎందుకంటే ఆయన కోపం త్వరగా రగులుకుంటుంది. ఆయన్ని ఆశ్రయించే వాళ్లందరూ సంతోషంగా ఉంటారు.

అధస్సూచీలు

లేదా “గొణుక్కుంటున్నారు?”
లేదా “ఆయన క్రీస్తుకు.”
లేదా “కలిసి ఆలోచన చేస్తున్నారు.”
లేదా “హెచ్చరిక వినండి.”
అక్ష., “ముద్దుపెట్టుకోండి.”
అక్ష., “ఆయనకు.”