సామెతలు 20:1-30

  • ద్రాక్షారసం నవ్వులపాలు చేస్తుంది (1)

  • సోమరి చలికాలంలో పొలం దున్నడు (4)

  • మనిషి హృదయంలోని ఆలోచనలు లోతైన నీళ్లలాంటివి (5)

  • తొందరపడి ఒట్టేయడం గురించి హెచ్చరిక (25)

  • యౌవనుల బలమే వాళ్లకు సౌందర్యం (29)

20  ద్రాక్షారసం నవ్వులపాలు చేస్తుంది,+ మద్యం అదుపుతప్పేలా చేస్తుంది;+వాటివల్ల దారితప్పేవాళ్లు తెలివిగలవాళ్లు కాదు.+   రాజు వల్ల కలిగే భయం సింహగర్జన లాంటిది;+రాజుకు కోపం తెప్పించేవాడు తన ప్రాణానికి హాని తెచ్చుకుంటాడు.+   గొడవలకు దూరంగా ఉండడం మనిషికి గౌరవం,+అయితే తెలివితక్కువ వాళ్లంతా వాటిలో తలదూరుస్తారు.+   సోమరి చలికాలంలో పొలం దున్నడు,కాబట్టి కోతకాలంలో తన దగ్గర ఏమీ లేకపోవడంతో అతను బిచ్చం ఎత్తుకుంటాడు.*+   మనిషి హృదయంలోని ఆలోచనలు* లోతైన నీళ్లలాంటివి,వివేచన గలవాడు వాటిని పైకి చేదుతాడు.   తాము విశ్వసనీయ ప్రేమ గలవాళ్లమని చాలామంది చెప్పుకుంటారు,అయితే నమ్మకమైన మనిషి ఎక్కడ దొరుకుతాడు?   నీతిమంతుడు యథార్థంగా నడుచుకుంటాడు.+ అతని తర్వాత వచ్చే అతని పిల్లలు* సంతోషంగా ఉంటారు.+   రాజు న్యాయపీఠం మీద కూర్చున్నప్పుడు,+తన కళ్లతో చెడుతనమంతటినీ జల్లెడ పడతాడు.+   “నా హృదయాన్ని శుద్ధి చేసుకున్నాను;నాలో ఇక ఏ పాపం లేదు” అని ఎవరైనా అనగలరా?+ 10  తప్పుడు తూకంరాళ్లు, తప్పుడు కొలతలు*ఈ రెండూ యెహోవాకు అసహ్యం.+ 11  పిల్లవాడు కూడా తన ప్రవర్తన పవిత్రంగా, సరిగ్గా ఉందో లేదోతన పనుల ద్వారా తెలియజేస్తాడు.+ 12  వినే చెవి, చూసే కన్నురెండిటినీ యెహోవాయే చేశాడు.+ 13  నిద్రను ప్రేమించకు, లేదంటే నువ్వు పేదవాడివౌతావు. మేల్కొని ఉండు, అప్పుడే నువ్వు కడుపునిండా తింటావు.+ 14  కొనేవాడు, “బాలేదు, బాలేదు!” అంటాడు;తర్వాత పక్కకు వెళ్లి తన గురించి గొప్పలు చెప్పుకుంటాడు.+ 15  బంగారం ఉంది, విస్తారంగా పగడాలు* కూడా ఉన్నాయి;అయితే జ్ఞానంగల పెదాలు వాటికన్నా అమూల్యమైనవి.+ 16  పరిచయంలేని వాడికి హామీగా ఉన్న వ్యక్తి వస్త్రాన్ని తీసుకో,+ఒకవేళ అతను హామీగా ఉన్నది అనైతిక* స్త్రీకైతే, అతను హామీగా పెట్టినదాన్ని లాక్కో. 17  మోసం చేసి సంపాదించిన ఆహారం మనిషికి రుచిగా అనిపిస్తుంది,కానీ తర్వాత అతని నోరు ఇసుకతో నిండిపోతుంది.+ 18  సంప్రదించుకోవడం* వల్ల ప్రణాళికలు సఫలమౌతాయి,*+తెలివిగల* నిర్దేశంతో యుద్ధం చేయి.+ 19  లేనిపోనివి కల్పించి చెప్పేవాడు రహస్యాలు బయటపెడుతుంటాడు;+పుకార్లు చెప్పడాన్ని ఇష్టపడేవాళ్లతో* సహవాసం చేయకు. 20  తండ్రిని గానీ తల్లిని గానీ శపించేవాడి దీపంచీకటి పడినప్పుడు ఆరిపోతుంది.+ 21  మొదట్లో అత్యాశతో సంపాదించిన ఆస్తిచివరికి దీవెనగా ఉండదు.+ 22  “నాకు హాని చేసినందుకు ప్రతీకారం తీర్చుకుంటాను!” అని అనకు,+ యెహోవా కోసం కనిపెట్టుకో,+ ఆయనే నిన్ను కాపాడతాడు.+ 23  తప్పుడు* తూకంరాళ్లు యెహోవాకు అసహ్యం,దొంగ త్రాసు మంచిదికాదు. 24  మనిషి అడుగుల్ని యెహోవాయే నిర్దేశిస్తాడు;+తాను వెళ్లాల్సిన దారిని మనిషి ఎలా తెలుసుకోగలడు? 25  ఒక వ్యక్తి తొందరపడి, “ప్రతిష్ఠితం” అని చెప్పి,+ ఆ తర్వాత తన మొక్కుబడి గురించి మళ్లీ ఆలోచించడం అతనికి ఉరిలా ఉంటుంది.+ 26  తెలివిగల రాజు దుష్టుల్ని జల్లెడ పడతాడు,+నూర్చే చక్రాన్ని వాళ్ల మీద నుండి పోనిస్తాడు.+ 27  మనిషి ఊపిరి యెహోవా దీపం,అది అతని అంతరంగాన్ని పరిశోధిస్తుంది. 28  విశ్వసనీయ ప్రేమ, నమ్మకత్వం రాజును కాపాడతాయి;+విశ్వసనీయ ప్రేమతో అతను తన సింహాసనాన్ని స్థిరపర్చుకుంటాడు.+ 29  యౌవనుల బలమే వాళ్లకు అలంకారం,*+నెరిసిన తలే వృద్ధులకు వైభవం.+ 30  దెబ్బలు, గాయాలు చెడును తొలగిస్తాయి,*+దెబ్బలు అంతరంగాన్ని శుద్ధి చేస్తాయి.

అధస్సూచీలు

లేదా “అతను కోతకాలంలో వెదుకుతాడు కానీ ఏమీ దొరకదు” అయ్యుంటుంది.
లేదా “ఉద్దేశాలు.”
అక్ష., “కుమారులు.”
లేదా “రెండు రకాల తూకంరాళ్లు, రెండు రకాల కొలపాత్రలు.”
పదకోశం చూడండి.
లేదా “విదేశీ.”
లేదా “ఆలోచన.”
లేదా “స్థిరపడతాయి.”
లేదా “నేర్పుగల.”
లేదా “తమ పెదాలతో ఇతరుల్ని ప్రలోభపెట్టేవాళ్లతో.”
లేదా “రెండు రకాల.”
లేదా “అందం.”
లేదా “శుభ్రం చేస్తాయి.”