కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీరెప్పుడైనా ఆలోచించారా?

మీరెప్పుడైనా ఆలోచించారా?

పేదరికం లేకుండా చేయవచ్చా?

పేదరికం లేని ప్రపంచాన్ని దేవుడు ఎలా తీసుకొస్తాడు?—మత్తయి 6:9, 10.

కడు పేదరికం వల్ల కుపోషణతో, జబ్బులతో ప్రతీ సంవత్సరం లక్షలమంది చనిపోతున్నారు. ప్రపంచంలో కొన్ని ప్రాంతాలు వర్థిల్లుతూ ఉన్నా చాలామంది ఇంకా ఆకలితో అలమటిస్తూనే ఉన్నారు. సంవత్సరాలుగా పేదరికం సమస్యగా ఉందని బైబిలు చెబుతుంది.—యోహాను 12:8 చదవండి.

పేదరికం లేకుండా చేయాలంటే ప్రపంచవ్యాప్తంగా ఒకే ప్రభుత్వం ఉండాలి. ఆ ప్రభుత్వం ప్రపంచ వనరులన్నిటిని అందరికీ సమానంగా అందేలా చూడాలి, పేదరికానికి ముఖ్య కారణమైన యుద్ధాల్ని ఆపేయాలి. అలాంటి ప్రభుత్వాన్నే ఇస్తానని దేవుడు మాటిస్తున్నాడు.—దానియేలు 2:44 చదవండి.

పేదరికాన్ని ఎవరు తీసేస్తారు?

మనుషులను పరిపాలించడానికి దేవుడు తన కుమారుడైన యేసును నియమించాడు. (కీర్తన 2:4-8) యేసు పేదలను రక్షిస్తాడు. అణచివేత, హింసను తీసేస్తాడు.—కీర్తన 72:8, 12-14 చదవండి.

సమాధానకర్తయగు అధిపతి యేసే అని ఆయన గురించి బైబిల్లో ముందే ఉంది. ఆయన ప్రపంచమంతటా శాంతిభద్రతలను తీసుకువస్తాడు. ప్రజలందరికీ సొంత ఇల్లు, మంచి పని, కావాల్సినంత ఆహారం ఉంటుంది.—యెషయా 9:6, 7; 65:21-23 చదవండి. (w15-E 10/01)